ఆయన రాజీనామా వార్త చూసి షాక్ అయ్యాను: కేటీఆర్

Share Icons:

హైదరాబాద్, 8 మార్చి:

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు రాజీనామా వార్త ఈరోజు ఉదయం లేవగానే చూసి షాక్ అయ్యాను అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో వింగ్స్ ఇండియా 2018 ఏరోస్పేస్ సదస్సును కేటీఆర్ ప్రారంభించారు.

ఈ సదస్సు ప్రారంభం ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఈరోజు మంత్రి అశోక్ గజపతిరాజు ఏరోస్పేస్ సదస్సుకు హాజరు కావాల్సి ఉందని, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సదస్సుకు హాజరుకాలేకపోయారని అన్నారు.

ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని కేటీఆర్ పేర్కొన్నారు. భారత దేశ చరిత్రలో 70 ఏళ్లలో 70 విమానాశ్రయాలు ఉంటే, అశోక్ గజపతి రాజు సారథ్యంలో గడిచిన మూడేళ్లలోనే 50 నుంచి 60కిపైగా కొత్త విమానాశ్రయాలు ఏర్పాటయ్యాయని ఆయన తెలిపారు. ఈ నాలుగేళ్లలో భారత విమాన రంగానికి ఆయన ఎనలేని కృషి చేశారని చెప్పారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమని అన్నింటికీ సిద్ధంగా ఉండాలని కేటీఆర్ అన్నారు.

ఇక వింగ్స్ ఇండియా 2018 ఏరోస్పేస్ సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యి ప్రారంభించారు. అమెరికా, జపాన్, జర్మనీ, రష్యా, సింగపూర్, ఫ్రాన్స్, మలేషియా, హాంగ్‌కాంగ్, ఇటలీ, ఇరాన్ , బ్రిటన్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరైన ఈ సదస్సుకు హజరయ్యారు.

మామాట: నిజమే.. విమాన రంగానికి ఆయన చేసిన కృషి అభినందనీయమే…

English summary:

Telangana IT Minister got a shocked to news of Union civil aviation minister Ashok Gajapathiraju resigns his ministry.

One Comment on “ఆయన రాజీనామా వార్త చూసి షాక్ అయ్యాను: కేటీఆర్”

  1. He is the only sincere and genuine minster in TDP. Did a good job for aviation industry

Leave a Reply