కారు దిగి…సెల్ఫీకి ఫోజిచ్చి….

Share Icons:

హైదరాబాద్,  సెప్టెంబర్ 4:

తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ఓ సాధారణ పౌరుడిగా వ్యవహరించారు. హైదరాబాద్ కింగ్ కోఠి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్( రెడ్) పడగానే తన వాహనశ్రేణిని ఆపారు. బైక్ పై వెళ్తున్న బెంగళూరు ఐటీ ఉద్యోగి వైష్ణవి కేటీఆర్‌ను చూసి విష్ చేయగా వెంటనే కారునుంచి దిగి ఆమెను పలకరించారు.

మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీ దిగాలన్న కోరికను వైష్ణవి వ్యక్తం చేయగా అందుకు వెంటనే మంత్రి అంగీకరించారు. వైష్ణవితో పాటు ఆ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న పలువురు కేటీఆర్‌తో సెల్ఫీలు దిగడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఓ సీఎం కుమారుడని, కీలక శాఖల మంత్రిని అనే అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్యుడిల వ్యవహరించిన కేటీఆర్ తీరు ప్రశంసలకు కారణం అయ్యింది.

మామాట: జనాకర్ష నేతగా ఎదుగుతున్న కేటీఆర్….

Leave a Reply