బాబు..ఆంధ్రా ప్రజల్ని గాలికొదిలేసి తెలంగాణలో ప్రచారం…

Share Icons:

ఉట్నూర్‌, 3 డిసెంబర్:

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాశనం చేసిన తెలంగాణను ఇప్పుడిప్పుడే బాగు చేసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆంధ్రా ప్రజలను గాలికి వదిలేసి తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు గుంపులుగా వస్తున్నాయని విమర్శించారు. 

ఇక సంక్రాంతికి ముందే గంగిరెద్దులా మహాకూటమి అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మిగతా పార్టీల బాసులు ఢిల్లీలో, అమరావతిలో ఉంటే టీఆర్ఎస్ బాసులు మాత్రం గల్లీల్లో ఉంటారని స్పష్టం చేశారు. కేసీఆర్ పై దుష్ప్రచారం చేస్తున్న పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 

మరోవైపు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం గీసుకోకుంటే తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు.  తెలంగాణలో 3వేల 400 తండాలు, గూడేలను పంచాయితీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని కేటీఆర్ చెప్పారు.

మామాట: విమర్శలు కంటే చేసిన అభివృద్ధి పనులు చెప్పుకుంటే బెటర్ ఏమో..

Leave a Reply