సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ వస్తోంది

Share Icons:

హైద్రాబాద్, ఆగస్టు 30,

టాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్స్ హవా నడుస్తోంది.  ఇటీవల సావిత్రిపై నిర్మించిన మహానటి సినిమా సంచలన విజయం సాధించడంతో దర్శక, నిర్మాతలు ఆ వైపు వడివడిగా అడుగుల వేస్తున్నారు. తాజగా ఓ సీనియర్ నటుడి బయోపిక్ వెండితెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ డిటేల్స్ ఇప్పడు చూద్దాం. ప్రస్తుతం తెలుగులో విశ్వ విఖ్యాత ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్నది. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత చరిత్రతో మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా చేస్తున్నాడు. మహా నేత వైఎస్పార్ బయోపిక్‌ కూడా వడివడిగా షూటింగ్ జరుపుకుంటుంది. కత్తి కాంతారావు జీవిత చరిత్రలో మరో సినిమా తెరకెక్కుతుండగా.. అక్కినేని నాగేశ్వర రావు జీవితం ఆధారంగా సినిమా చేసే ఆలోచనను కూడా అక్కినేని కుటుబం పరిశీలనలో ఉంది. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన హీరో ఎవరు అంటే సూపర్ స్టార్ కృష్ణ అనే అంటారు. కౌబాయ్ సినిమాలను తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ చేసింది కృష్ణే. కలర్, స్కోప్ ఇలా ఎన్నో మార్పులను ఆయన సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోగా సూపర్ స్టార్ కృష్ణకు పేరుంది. 500 పైచిలుకు సినిమాల్లో నటించిన ఈ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవ అంతాఇంతా కాదు. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేయబోతున్నారట.ఇదే విషయాన్ని కృష్ణ అల్లుడు హీరో సుదీర్ బాబు వెల్లడించారు. త్వరలోనే సూపర్ స్టార్ కృష్ణ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతుందని, ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెళ్లడిస్తామని సుదీర్ బాబు ఇటీవలే తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ తర్వాత ఆ స్థాయిలో చెప్పుకునే పేరు కృష్ణ. ఆయన సినిమానే ప్రాణంగా జీవించారు. మరి ఈ సినిమాతో కృష్ణ జీవితంలో ఎటువంటి వెలుగు, నీడలు బయటకు వస్తాయో చూడాలి.

మామాట: అంటే ఇది ఆత్మకథల కాలమనమాట

Leave a Reply