ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి.. మంత్రి వర్గసమావేశం లో నిర్ణయం…

Share Icons:
  • టీఆర్ఎస్ పై ఉత్కంఠ ,బీసీ అభ్యర్థికే టికెట్:!! లీకులు
  • కౌశిక్‌రెడ్డికి నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ పదవి

హుజురాబాద్ ఉపఎన్నికల్లో టికెట్ ఆశించిన పాడి కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవి దక్కనుండగా , స్థానిక నేతకు బలమైన బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం . ఎవరు బలమైన బీసీ నాయకుడు …స్వర్గం రవి  అనే చర్చ . రాజకీయ చాణిక్యుడైన కేసీఆర్ ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఉపయోగించుకుంటారో అనే చర్చ జరుగుతుంది.

హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ యస్ గెలుపుకోసం చేయని ప్రయత్నంలేదు…. దళిత బందు తెచ్చారు. చేనేతకు సహాయం అంటున్నారు. ఉన్న పథకాలే కాకుండా ప్రతిఇంటికి ఒక పథకం అమలు చేయాలనీ నిర్ణయించారు. అనేకమంది ని పార్టీలో చేర్చుకున్నారు. మరికొంత మందిని చేర్చుకునేందుకు పథక రచన చేస్తున్నారు. ఇప్పడు చేరిన వారిలో ఎవరికీ సీటు ఇస్తారో తెలియదు .చేరిన వారిలో ఎల్ వి రమణ , పాడి కౌశిక్ రెడ్డి , ఇనగాల పెద్దిరెడ్డి , స్వర్గం రవి లాంటి వారు ఉన్నారు. పార్టీ లో చేరాక ముందే పాడి కౌశిక్ రెడ్డి తనకే టీఆర్ యస్ సీటు అని ప్రచారం చేసుకున్నారు. అంటే ముందుగానే ఆయన కు సీటు ఆఫర్ చేసినట్లు చెప్పుకున్నారు. ఇప్పుడు ఆయన్న నామినేటెడ్ ఎమ్మెల్సీ గా గవర్నర్ కోట కింద ఎంపిక చేయాలనీ కాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డి ఉపఎన్నిక టికెట్ రేసులో లేరు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

 

Leave a Reply