జర్నలిస్టుపై దాడిపై వైసీపీ ఎమ్మెల్యే వివరణ…

Share Icons:

నెల్లూరు:

 

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనని బెదిరించరని, హత్యాయత్నం చేయబోయారని జమీన్‌రైతు’ ఎడిటర్‌ డోలేంద్రప్రసాద్‌  ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై  ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పందించారు. ప్రసాద్ తనను అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. తాను డోలేంద్ర మీద దాడి చేయలేదని, ఎవరినీ కిడ్నాప్‌ చేయలేదని ఆయన తెలిపారు.

 

ఆదివారం రాత్రి నేను మద్యం సేవించి డోలేంద్ర ఇంటికి వెళ్లి ఆయనపై హత్యాయత్నం చేశానని, ఎవరినో కిడ్నాప్‌ చేశానని కేసు పెట్టారు. తొలి నుంచీ డోలేంద్రతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. 1981లో ఆయన సర్పంచుగా పోటీ చేస్తే నేను జెండా పట్టుకుని కార్యకర్తగా పని చేశాను. మొన్నటి ఎన్నికలకు ముందు నెల్లూరు రూరల్‌ నుంచి టీడీపీ తరఫున పోటీ చేయాలని నన్ను కోరారు. నేను తిరస్కరించాను. అలాగే కస్తూరిదేవి స్కూల్‌ విషయంలో ఉద్యమించాలన్న డోలేంద్ర సూచననూ నేను తిరస్కరించాను.ఈ రెండు కారణాలతో నా పై ఆయన ద్వేషం పెంచుకొన్నారని అన్నారు.

 

ఈ క్రమంలో కస్తూరిదేవి స్కూల్‌ విషయం మాట్లాడేందుకు నా దగ్గరకు ఆదివారం రాత్రి వస్తానని డోలేంద్ర చెప్పారు. అయితే నేనే మీ ఇంటికి వస్తానని చెప్పి వెళ్లాను. నేను ఆ స్కూలు విషయంలో పోరాటం చేయనని ఆయనకు చెప్పాను. దానిపై నన్ను దుర్భాషలాడారు. జీవీకే సంస్థకు అమ్ముడుపోనంటూ దురుసుగా మాట్లాడారు. ఎవరు అమ్ముడు పోయేవారో అందరికీ తెలుసునంటూ నేనూ ప్రతిస్పందించడంతో కొంత వాగ్వివాదం జరిగింది. ఈలోపు అక్కడే ఉన్న డాక్టర్‌ వసుంధర సర్దిచెప్పి నన్ను పంపివేశారు. అంతేతప్ప నేను ఎటువంటి హత్యాయత్నం గానీ, కిడ్నాప్‌ గానీ చేయలేదు అని కోటంరెడ్డి పేర్కొన్నారు.

 

Leave a Reply