మళ్ళీ కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్?

Koratala siva and jr ntr another movie
Share Icons:

హైదరాబాద్, 31 జూలై:

కొరటాల శివ…మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి భారీ హిట్ సినిమాలని తెలుగు ఇండస్ట్రీకి అందించిన దర్శకుడు. ఇక ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

అది ఎన్టీఆర్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అలాంటి ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ తో మరో సినిమా చేయడానికి కొరటాల సన్నాహాలు మొదలుపెట్టాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ప్రస్తుతం కొరటాల శివ, చిరంజీవి కథానాయకుడిగా ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లాలనే ఉద్దేశంతో ఆయన వున్నాడని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక దీని తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నాడు. ఇందులో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు.

మామాట: హిట్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందా?

Leave a Reply