అవసరమైతే ఆ మూడు చోట్ల ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాం….

konda surekha sensational comments on kcr
Share Icons:

హైదరాబాద్, 8 సెప్టెంబర్:

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి తన పేరును పెండింగులో పెట్టడం బాధ కలిగించిందని మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ఈరోజు తన భర్త కొండా మురళితో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్లలో తాము చేసిన తప్పేమీ లేదని, ప్రభుత్వానికి గానీ పార్టీకి గానీ వ్యతిరేకంగా పనిచేయలేదని అన్నారు.

అసలు వరంగల్ లోని 12 స్థానాల్లో 11 మంది జాబితాను ప్రకటించి, తన పేరు ప్రకటించకపోవడంపై కారణం తెలియక మీడియా ద్వారా అడగడానికి వచ్చానని ఆమె అన్నారు.  తన పేరును పక్కన పెట్టడాన్ని బీసీలను, తెలంగాణ మహిళలను అవమానించినట్లుగా భావిస్తున్నానని తెలిపారు.

తాము ఏ పార్టీ జెండా పట్టుకున్నా ఎందుకు పార్టీ మారారని తమ అనుచరులు అడగబోరని, తమ వెంట ఉంటారని చెప్పారు. తమ పేరు తొలి జాబితాలో ఎందుకు లేదో సమాధానం చెప్పాలని ఆమె టీఆర్ఎస్ నాయకత్వాన్ని అడిగారు. సమాధానం వచ్చిన తర్వాత ఏం చేయాలో తాము నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు.

రెండు మూడు రోజుల్లో బహిరంగ లేఖ రాసి, ఏ పార్టీలో చేరుతామనో చెబుతామని అన్నారు. అవసరమైతే భూపాలపల్లి, పరకాల, వరంగల్ ఈస్ట్ లో తమ కుటుంబం ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుందని సురేఖ స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి హామీలు ఇచ్చారని, అటువంటివారికి ఎవరికీ న్యాయం జరగలేదని, వలసలు వచ్చినవారు ఆలోచించాల్సిన సమయం ఇదేనని ఆమె అన్నారు.

మామాట: అయితే టీఆర్ఎస్ వీడడం ఖాయమే అనుకుంటా..      

Leave a Reply