కాంగ్రెస్ వైపు కొండా దంపతుల చూపు….

Konda surekha is going to joins congress.jpg
Share Icons:

వరంగల్, 8 సెప్టెంబర్:

మొన్న కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయడం వెనువెంటనే 105 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసి ముందస్తు ఎన్నికల రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇక పనిలో పనిగా నిన్న హుస్నాబాద్‌లో తొలి సభ పెట్టి ఎన్నికల శంఖారావం కూడా పూరించారు.

ఇది ఇలా ఉంటే టీఆర్ఎస్ తొలి విడత జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో చాలామంది నేతలు కలత చెందారు. అందులో కొందరు నేతలనీ అధిష్టానం బుజ్జగించడంతో పార్టీలో ఉండటానికి ఒకే చెప్పారు. ఇక మరి కొందరు నేతలు అయితే ఇండిపెండెంట్‌గా అయిన పోటీ చేసి ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ అభ్యర్ధులని ఓడిస్తామని చెబుతున్నారు. ఇక ఇదే క్రమంలో లిస్ట్‌లో తన పేరు లేకపోవడంతో తీవ్రంగా కలత చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు సమాచారం. ఆమె శనివారం ఉదయం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేదా హరీష్ రావుతో సమావేశమైన తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖకు తొలి విడత జాబితాలో కేసిఆర్ టికెట్ ఖరారు చేయలేదు. తన కూతురు సుస్మితా పటేల్‌కు పరకాల లేదా భూపాలపల్లి సీటు కేటాయించాలని కొండా సురేఖ కోరుతున్నారు.

అయితే, తన కూతురికి టికెట్ కేటాయించకపోగా, తనకే కేసిఆర్ ఎసరు పెట్టారనే ఆవేదనతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖతో స్థానిక నేతలకు తీవ్రమైన విభేదాలున్నాయి. పైగా, తూర్పు నియోజకవర్గం సీటును పలువురు టీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నారు.

ఈ పరిస్థితిలో తనకు కూడా టికెట్ వస్తుందో రాదో అనే డైలమాలో సురేఖ ఉన్నారు. దాంతో ఆమె పార్టీ మారాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తుపై ఆమె శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం ఆమె ప్రెస్ మీట్ పెట్టి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మామాట: అసంతృప్తి జ్వాల ఆగేది కాదులే…!

Leave a Reply