మళ్ళీ ఆయన ఇటు వస్తున్నారా…

Share Icons:

అమరావతి, 18 మార్చి:

రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయనేది ఎవరు చెప్పలేం. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏపీ ఎన్నికల సందర్భంగా బాగా కనిపిస్తోంది. దానికి ఉదాహరణే విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ పరిస్థితి. ఇటీవల ఆయన టీడీపీలో చేరతారు అని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుజ్ఞ ఆయన చంద్రబాబుని కలిశారు. కానీ సడన్‌గా ఆయన శనివారం జగన్‌ని భేటీ అయ్యారు. దీంతో ఆయన వైసీపీలో చేరతారని అనకాపల్లి ఎంపీ సీటు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో కొణతాల రామకృష్ణను పూర్తిగా లైట్ తీసుకున్నారు.

కొణతాలకు బదులుగా సత్యవతి అనే మహిళకు అనకాపల్లి ఎంపీ సీటు కేటాయించారు. తనకు అనకాపల్లి ఎంపీ సీటు రాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీమంత్రి కొణతాల రామకృష్ణ… ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఆయన త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే టీడీపీలో చేరినా… కొణతాల రామకృష్ణకు అనకాపల్లి ఎంపీ సీటు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సీటును టీడీపీ తరపున అడారి ఆనంద్‌కు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొణతాల రామకృష్ణకు భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం.

మామాట: రెండు పడవల మీద కాలేస్తే ఇబ్బందేగా

Leave a Reply