TRENDING NOW

వారి మద్ధతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది…

వారి మద్ధతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది…

నల్గొండ, 8 అక్టోబర్:

తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజల ఆంకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈరోజు నల్గొండలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని చెప్పారు.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy
treefurn AD

ఇక రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పరాభవం తప్పదని, టీఆర్ఎస్ ఓటమిపాలు కావడం ఖాయమని అన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల రైతు రుణమాఫీపై తొలి సంతకం పెడతామని చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని… తండ్రి సీఎం, కొడుకు, అల్లుడు మంత్రులు, కుమార్తె ఎంపీ అయ్యారని విమర్శించారు.

మామాట: మరి ప్రజల మద్ధతు ఎవరికి ఉందో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: