TRENDING NOW

దీక్షకు దిగనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…

దీక్షకు దిగనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…
views:
130

హైదరాబాద్, 13 మార్చి:

సోమవారం అసెంబ్లీ లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పై హెడ్ ఫోన్స్ విసిరిన ఘటనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ కుమార్ లను బాధ్యులుగా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వారి సభ్యత్వాన్ని రద్దు చేసింది.

ఈ నేపథ్యంలో దీనిని నిరసిస్తూ గాంధీభవన్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహారదీక్ష చేయనున్నారు.

ఇక అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన కాంగ్రెస్ నేతలు జానారెడ్డి సమక్షంలో సమావేశమయ్యారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు, సస్పెండ్‌ను ఏఐసీసీ తరపున ఖండిస్తున్నానని తెలంగాణ ఇన్‌చార్జ్ కుంతియా చెప్పారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ సభ్యత్వం రద్దు అప్రజాస్వామికమని అన్నారు.

అంతకముందు కాంగ్రెస్ హయాంలో హరీష్‌రావు అసెంబ్లీలో వ్యవహరించిన తీరు గుర్తులేదా అని ఆయన ప్రశ్నించారు.

పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు వెల్‌లోకి వెళ్తున్నప్పుడు, అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపితే తప్పేంటి అని ఆయన నిలదీశారు.

మామాట: ఇలా ఏకపక్షంగా సభ్యత్వాన్ని రద్దు చేయడం సబబేనా..

English summary:

The Telangana government cancelled their membership by making Congress MLAs Komati Reddy and Sampath Kumar responsible for the attack with Headphones on Legislative Council Chairman Swami Gowda on Monday. In this occasion komatireddi and sampath kumar are going to do hunger strike.

(Visited 20 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: