TRENDING NOW

చాలా బాధేస్తుంది….

చాలా బాధేస్తుంది….

మొహాలీ, 11 మార్చి:

ఆదివారం ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ధావన్ 143, రోహిత్ 95 పరుగులతో రాణించడం వలన 50 ఓవర్లలో 358 పరుగులు చేసింది. అయితే తర్వాత ఖవాజా 91, హండ్స్‌కొంబ్ 117, టర్నర్ 84 పరుగులతో అద్భుతంగా ఆడటంతో 359 భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అలవోకగా ఛేదించి విజయాన్ని అందుకుంది. 

ఈ సందర్భంగా తమ ప్రదర్శన పట్ల విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి చెందడం వల్ల చాలా బాధేస్తోందని అన్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా మంచు గురించి తమ అంచనా తప్పయిందని అన్నాడు.  మంచు వల్ల చివర్లో తమ బౌలర్లకు అసలు పట్టు చిక్కలేదని, అయితే దీన్ని తమ ఓటమికి సాకుగా చెప్పనని అన్నాడు. ఆఖరి ఓవర్లలో ఐదు అవకాశాలు వృధా కావడం జీర్ణించుకోలేనదని,  స్టంపింగ్‌ అవకాశం చేజారిందని, ఫీల్డింగ్‌ బాగా లేదని అన్నాడు.

treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy

ఇక డీఆర్‌ఎస్‌ను సందేహించాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చిందని అన్నాడు. టర్నర్ 44వ ఓవరులో 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు జరిగిన విషయం వల్ల ఆ సందేహం ఉత్పన్నమవుతోందని అన్నాడు. బంతి టర్నర్ బ్యాట్‌ను తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతిలో పడినట్లు అనిపించడంతో ఇండియా అపీల్ చేసింది.

ఆన్ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదని, దాంతో ఇండియా రివ్యూకు వెళ్లింది. థర్డ్ అంపైర్ రివ్యూలో బ్యాట్ బంతిని తాకినట్లు అర్థమైంది. కానీ తగిన ఆధారం లేదంటూ థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వలేదు.  వరుసగా రెండు మ్యాచ్‌ల ఫలితాలతో తమ కళ్లు తెరచుకున్నాయని కోహ్లీ అన్నాడు. ఈ మ్యాచ్‌ ఫలితం మరో మాటకు తావు లేకుండా తమను చాలా బాధపెడుతోందని అన్నాడు.

మామాట: ప్రపంచ కప్ ముందు ఇలాంటి ఓటములు బాధపెడతాయి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: