ఒకే రికార్డుని బద్దలగొట్టడానికి పోటీపడుతున్న కెప్టెన్, వైస్ కెప్టెన్…

kohli vs rohit..bcci try to solve issues
Share Icons:

న్యూయార్క్:

 

ప్రపంచ కప్ లో సెమీస్ నుంచి నిష్క్రమించిన తర్వాత కొన్నివారాల పాటు విశ్రాంతి తీసుకున్న టీమిండియా…ఇప్పుడు వెస్టిండీస్ తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.  వెస్టిండీస్ తో నేడు అమెరికాలో టీ20 మ్యాచ్ లో తలపడనుంది. కాగా, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓ రికార్డు ముంగిట నిలిచారు. ఈ ఇద్దరు కూడా అంతర్జాతీయ టి20 క్రికెట్లో చెరో 20 అర్థసెంచరీలతో సమవుజ్జీలుగా ఉన్నారు. వీరిలో ఎవరు అర్ధసెంచరీ సాధించినా అత్యధిక ఫిఫ్టీల రికార్డు తమ పేరిట లిఖించుకుంటారు.

 

అటు టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్‌గా నిలిచేందుకు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ మరో నాలుగు సిక్స్‌ల దూరంలో నిలిచాడు. పొట్టిక్రికెట్లో విండీస్‌ వీరుడు క్రిస్‌గేల్‌ 105(58 మ్యాచ్‌ల్లో) సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ 103(76 మ్యాచ్‌ల్లో) సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా రోహిత్‌ 102(94 మ్యాచ్‌ల్లో) సిక్స్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు. శనివారం భారత్‌-వెస్టిండీస్‌ మధ్య తొలి టీ20 మ్యాచ్‌ ఫ్లోరిడాలో జరగనుంది.

 

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు క్రిస్‌గేల్‌ దూరంగా ఉండటంతో రోహిత్‌ శర్మ మరో నాలుగు సిక్సర్లు కొడితే టాప్‌లోకి దూసుకెళ్తాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రోహిత్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 32.37 సగటుతో 2,331 పరుగులు సాధించగా అందులో నాలుగు సెంచరీలు, 16 అర్ధశతకాలు ఉన్నాయి.

Leave a Reply