వన్డేల్లో అగ్రస్థానాన్ని నిలుపుకున్న కోహ్లీ, బూమ్రా

Kohli and bumra is the number one place in oneday rankings
Share Icons:

దుబాయ్, 8 అక్టోబర్:

అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బౌలింగ్ విభాగంలో పేసర్‌ జస్ప్రిత్‌ బూమ్రాలు టాప్‌లో కొనసాగుతున్నారు. కోహ్లి 884 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా, రోహిత్‌ శర్మ 842 పాయింట్లతో రెండో స్థానాన్ని కాపాడుకోగా, శిఖర్‌ ధావన్‌ 802 రేటింగ్‌ పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. టీ

అలాగే బౌలింగ్ విభాగంలో బూమ్రా 797 రేటింగ్‌ పాయింట్లతో ప్రథమ స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇక చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 3వ స్థానంలో నిలిచాడు.

టీమ్‌ ర్యాంకింగ్స్‌ విషయంలో భారత జట్టు 122 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. టాప్‌ ప్లేస్‌లో ఇంగ్లండ్‌(127 పాయింట్లు) ఉండగా,  న్యూజిలాండ్(112), దక్షిణాఫ్రికా(110)లు తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఇక ఆల్‌రౌండర్ల విషయానికొస్తే అఫ్గానిస్తాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ మొదటి  స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్‌కి చెందిన షకీబ్ అల్ హాసన్ రెండో స్థానంలో ఉన్నాడు.

మామాట:  ఈ అగ్రస్థానం ఎప్పటివరకు నిలుపుకుంటారో…

Leave a Reply