విజయసాయిరెడ్డి పై మాజీ స్పీకర్ కోడెల ఫైర్..

Share Icons:

గుంటూరు, 12 జూన్:

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఫైర్ అయ్యారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…విజయసాయి రెడ్డి ట్వీట్ తప్పుడు కేసులు పెట్టాలని ప్రోత్సహించేలా ఉందని కోడెల పేర్కొన్నారు. స్పీకర్‌గా తాను అసెంబ్లీ ప్రతిష్ఠను దిగజార్చానని ఆయన ట్వీట్ చేశారని, అది కరెక్ట్ కాదని అన్నారు.

నవ్యాంధ్రకి తాను తొలి స్పీకర్‌గా వ్యవహరించినందుకు గర్వంగా ఉందన్న కోడెల.. తనను అధికార ప్రతిపక్ష నాయకులు ఏకగ్రీవంగా ఆ పదవిలో కూర్చోబెట్టినట్టు చెప్పారు. స్పీకర్‌గా తానెప్పుడూ తప్పుడు పనులు చేయలేదన్నారు. అందరికీ అవకాశం ఇచ్చానని చెప్పారు.

తన కుటుంబ సభ్యులపై ఇప్పటి వరకు ఏడెనిమిది కేసులు పెట్టారని, ఇంకా వారు ఎన్ని కేసులు పెడతారో, ఎంత వరకు పెడతారో తనకు తెలియదన్నారు.

అయితే తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రారని, వారి పనులు వారు చేసుకుంటున్నారని ఎన్నోసార్లు చెప్పానని కోడెల గుర్తు చేశారు. అటువంటిది వారిపై కేసులు పెట్టుకుంటూ పోతునే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు

Leave a Reply