కోడెల మృతితో…ఆ రెండు చోట్ల టీడీపీ ఖాళీయేనా?

ap former speaker kodela sivaprasad suicide causes
Share Icons:

అమరావతి: టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ గత సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే కోడెల మృతిపై అటు టీడీపీ, ఇటు వైసీపీలు పెద్ద రచ్చే చేస్తున్నాయి. కోడెలపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు దిగడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక చంద్రబాబు పట్టించుకోపోవడం వల్లే కోడెల చనిపోయారని వైసీపీ ఆరోపిస్తుంది. ఇక మరోవైపు కోడెల మృతిపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది.

ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయిన టీడీపీకి వరుస షాకులు తగులుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీని అనేకమంది నేతలు వీడి వైసీపీ, బీజేపీలో చేరడంతో…చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నాయకత్వలేమితో కొట్టమిట్టాడుతుంది. ఈ క్రమంలో కోడెల మృతితో గుంటూరు లోని సత్తెనపల్లి, నరసారావుపేట నియోజకవర్గాల్లో టీడీపీని నడిపించే నాయకుడు కనపడట్లేదు.

కోడెల నరసారావుపేట నుంచి 1983 నుంచి 1999 వరకు అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అలాగే 2004,2009ల్లో అదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. అయితే 2014 పొత్తులో భాగంగా నరసారావుపేటలో బీజేపీ పోటీ చేయడంతో…కోడెల సత్తెనపల్లిలో పోటీ చేసి గెలిచారు. అప్పుడు కోడెల సత్తెనపల్లి ఎమ్మెల్యేగా, నరసారావుపేట ఇన్ చార్జ్ కూడా పని చేశారు. ఇక 2019 ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లి నుంచి ఓడిపోయారు. అయితే కోడెలకు రెండు నియోజకవర్గాల్లో పట్టుంది. పైగా మొన్న నరసారావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన అరవింద్ బాబు యాక్టివ్ గా లేరు.

దీంతో కోడెలని సత్తెనపల్లి, నరసారావుపేటలని చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కోడెల మరణం వల్ల రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఖాళీ అయింది. కోడెల కుమారుడు, కుమార్తెలు రాజకీయాల్లో రావడానికి ఆసక్తి చూపడం లేదు. వచ్చిన వాళ్ళకు పార్టీని నడిపించే సామర్ధ్యం లేదు. దీంతో ఈ రెండు చోట్ల టీడీపీకి కష్టకాలం వచ్చిందనే చెప్పాలి. రానున్న రోజుల్లో చంద్రబాబు వీటిపైన దృష్టి పెట్టి టీడీపీ ఇన్ చార్జ్ లని నియమిస్తారేమో. ఏది ఏమైనా టీడీపీలో కోడెల లేని లోటు పూడ్చలేనేదని చెప్పొచ్చు.

Leave a Reply