TRENDING NOW

రేవంత్‌కి షాక్ ఇచ్చిన ఈసీ…

రేవంత్‌కి షాక్ ఇచ్చిన ఈసీ…
views:
479

కొడంగల్, 3 డిసెంబర్:

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కొడంగల్ లో రేపు జరిగే ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో కేసీఆర్ ను ఈ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదుచేశారు.

అయితే కేసీఆర్‌ను కొడంగల్‌లో అడుగుపెట్టకుండా అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించడంతో టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అలాగే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను సమర్పించింది.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించింది. దీంతో కొడంగల్ పోలీసులు రేవంత్ రెడ్డిపై కేసు నమోదుచేశారు.

మామాట: మరి చూడాలి పోలీసులు రేవంత్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో

(Visited 920 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: