ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లో విఫలమైన టిఆర్ఎస్ ప్రభుత్వం – కోదండరాం 

Share Icons:

హైదరాబాద్, సెప్టెంబర్ 10,

నాలుగు సవంత్సరాల కింద తెరాస పార్టీ  జిఎచ్ఎంసి   అవుట్ సోర్సింగ్  కార్మికులకు  ఇచ్చిన వాగ్దానాలు  నెరవేర్చడం లో పూర్తిగా విఫలమైనదని టీ ఎస్ జె  అధ్యక్షులు  ప్రో. కోందండరాం విమర్చించారు. జి ఎచ్ ఎం ఇ యూ అధ్యక్షులు ఉదారి గోపాల్, ఎం. కిరణ్ కుమార్ అవుట్ సోర్సింగ్ అధ్యక్షులు ల  ఆధ్వర్యంలో జరుగుతున్న అమరణ నిరాహార దీక్ష  నేటితో నాలుగు రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా సోమవారం    కోందండరాం, టీ డి పి పార్టీ నాయకుల  అమరణ నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలియజేశారు.

ఈ సందర్బంగా  ప్రో. కోందండరాం  మాట్లాడుతూ, జిఎచ్ఎంసి   అవుట్ సోర్సింగ్  కార్మికులను రెగ్యూలరైజ్,  పర్మనెంట్ ఉద్యోగులకు  హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు డిమాండ్లు  పూర్తి చేయడంలో విఫలమైనారన్నారు. ఈ తెరాస పార్టీ కి మల్లి గెలిపించకుండ చేయాలి అని ఆయన పిలుపు నిచ్చారు.   జి ఎచ్ ఎం ఇ యూ అధ్యక్షులు ఉదారి గోపాల్  మాట్లాడుతూ తెరాస పార్టీ మాకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుండా వాళ్ళ ప్రయోజనాల గురుంచి ముందస్తు ఎన్నికలో  పోటీకి దిగింది. మేము తెరాస పార్టీ కి ఎంతో సేవ చేశాం .. తెలంగాణ కు ముందు తెలంగాణ తర్వాత  కూడా  తెరాస పార్టీ వెన్నంటే ఉన్నాము కానీ ఇప్పుడు మాకు చాలా అన్యాయం జరిగింది.  రేపు  జి ఎచ్ ఎం సి లోని  30 సర్కిల్ లో మీటింగ్ జరిపించి పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నాం. ఈ  రోజు మాకు మద్దతి ఇచ్చిన  కోదండరాం,   టీ జె ఎస్  పార్టీకి మా జి ఎచ్ ఎం సి ఇరవై వేల కార్మికుల కుటుంబాలు రాబోయే ఎన్నికలో  పూర్తి మద్దతు ఇస్తామని  పేర్కొన్నారు.

మామాట: కార్మికులు నేతల మాట నమ్మడం మోసపోవడం.. జరుగుతూనే  ఉందిగా

Leave a Reply