హైదరాబాద్, సెప్టెంబర్ 11
బుధవారం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఒక్కరోజు దీక్ష చేపడుతున్నారు. అమరులకు స్థూపం కట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. ఉధ్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదు. అందుకు నిరసనగా ఒక్కరోజు దీక్ష జరుపుతున్నామని మాజీ ఎమ్మెల్సీ టీజేఎస్ నేత దిలీప్ కుమార్ వెల్లడించారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. జగ్గారెడ్డి ని కక్ష్యసాధింపు చర్యలతోనే అరెస్టుచేసారు. టీఆర్ఎస్ నేత షకీల్ అహ్మద్ పైనా ఇవే ఆరోపణలున్నాయి. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. అనవసర ఆరోపణలపై మా పేర్లు ప్రధాన వార్తగా వినియోగించుకున్నారు సంతోషమని అయన అన్నారు. జ్యోస్న ఆరోపణలు అవాస్తవం, అధికారికంగానే చందాలు ఇస్తారు. తెలంగాణ భవన్ ఎలా కట్టారు. 15కోట్లు ఎక్కడినుండి వచ్చాయి. చెక్కుల ద్వారా ఇచ్చిందెవరు. అనథాకారికంగా వచ్చిన నిధులెన్ని మొత్తం బయటపెడ్తానని అయన అన్నారు.
మామాట : పాపం ఆచార్య కోదండరామ్ ఒంటరి పోరాటం