TRENDING NOW

గుడివాడ పోరు: కొడాలి వర్సెస్ దేవినేని

గుడివాడ పోరు: కొడాలి వర్సెస్ దేవినేని

విజయవాడ, 13 మార్చి:

రాబోయే ఎన్నికల్లో తమకు కంచుకోటగా ఉన్న గుడివాడలో విజయం సాధించి సత్తా చాటాలని టీడీపీ చూస్తుంటే….ఈసారి కూడా టీడీపీ కంచుకోటలో తమ జెండా ఎగరవేయాలని వైసీపీ చూస్తోంది. 

ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా  కొడాలి వెంకటేశ్వరరావు(నాని) ఉన్నారు. నాని 2004, 09లో రెండు సార్లు టీడీపీ నుండి, ఒకసారి 2014లో వైసీపీ నుండి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఈ క్రమంలోనే నాలుగోసారి కూడా గెలిచి సత్తా చాటాలని చూస్తోన్నారు.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy
treefurn AD

ఈ నియోజకవర్గంలో మాస్ లీడర్‌గా ఉన్న నానికి…యూత్‌లో మంచి పట్టుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఓటర్లు నానికి అండగా నిలుస్తూ వస్తున్నారు. మరోవైపు నానికి ఎన్టీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో…ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ అభిమానులు కొందరు నానికి మద్ధతు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే దురుసుతనంగా మాట్లాడటం నానికి మైనస్ అనే చెప్పాలి.

మరోవైపు కంచుకోటని ఎలా అయిన  దక్కించుకోడానికి టీడీపీ వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే దివంగత దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్‌ని నానిపై పోటీకి దింపారు. ఇటీవలే రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడుగా ఎంపిక అయిన అవినాష్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అలాగే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ బాగానే అమలు అయ్యాయి. ఇక్కడ ముందు నుండి ఉన్న క్యాడర్ టీడీపీకి అదనపు బలం. అయితే విజయవాడ నుండి వచ్చిన అవినాష్ గుడివాడలో ఏ మేరకు రాణించగలరు అనేది చూడాలి.

మామాట: నానిని ఢీకొని గెలవడం అంత తేలికైన పని కాదులే 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: