TRENDING NOW

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని…

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని…

విజయవాడ, 11 జనవరి:

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…జగన్ పాదయాత్రను అడ్డుకోవడానికి చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశారని, గతంలో దివంగత సీఎం రాజశేఖరరెడ్డిపై కూడా ముఠా నాయకుడనీ, హత్యలు చేయిస్తాడని తన సొంత మీడియాతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారని మండిపడ్డారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా జగన్ వస్తే ఆయన్ను అధికారం నుంచి తప్పించలేమన్న భయంతో చంద్రబాబు, ఆయన భజన పత్రికలతో తప్పుడు ఆరోపణలు చేయించారని తెలిపారు.

treefurn AD
Life Homepathy

ఇక పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ స్వయంగా తన నోటితో చంద్రబాబును మించిన అవినీతి చక్రవర్తి ఎవరూ లేరని చెప్పినట్లు పేర్కొన్నారు. ‘అలాగే చంద్రబాబు, టీడీపీ నేతలు ఉచిత ఇసుక ద్వారా రూ.25,000 కోట్లు, నీరు-మట్టి కింద మరో రూ.45,000 కోట్ల నిధులు, రాజధానిలో లక్షల కోట్ల భూములను స్వాహా చేశారని ఆరోపించారు. నరేంద్ర మోదీ సంక నాలుగున్నర సంవత్సరాలు నాకిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.

తమ నాయకుడు జగన్ ప్రజలను నమ్ముకున్న వ్యక్తి అనీ, అందుకే 2014లో ఒంటరిగా పోటీ చేశాడని వ్యాఖ్యానించారు. ఈసారి కూడా ఒంటరిగానే పోటీ చేస్తారని స్పష్టం చేశారు.

మామాట: మరి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: