దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్: జట్టులో రోహిత్, గిల్ లకు చోటు…

KL Rahul dropped, Shubman Gill gets maiden call-up in India's Test squad for SA series
Share Icons:

ముంబై: మరో రెండో రోజుల్లో అనగా సెప్టెంబర్ 15న టీమిండియా…దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో మూడు టీ20లు జరగనున్నాయి. అయితే ఈ టీ20 సిరీస్ తర్వాత ఇండియా సఫారీలతో మూడు టెస్టులు ఆడనుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం జట్టును ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తాజాగా ప్రకటించింది. గత విండీస్ పర్యటనలో ఘోరంగా విఫలమైన ఓపెనర్ కే‌ఎల్ రాహుల్ ని సెలక్షన్ కమిటీ పక్కనబెట్టేసింది.

అతని స్థానంలో పరిమిత ఓవర్ల మ్యాచ్ లో ఓపెనర్ గా అదరగొడుతున్న రోహిత్ శర్మకి స్థానం కల్పించారు. వన్డే, టీ20ల్లో రాణిస్తున్న రోహిత్… టెస్టుల్లోనూ అదే ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నాం అని ఎమ్మెస్కే అన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తే రాహు ల్ మళ్లీ టెస్టు జట్టులోకి రావచ్చని స్పష్టం చేశాడు. ఇక గాయం నుంచి కోలుకున్న ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్యాని ఎంపిక చేయకుండా…యువ ఆటగాడు శుభమన్ గిల్ ని ఎంపిక చేశారు. గిల్…రోహిత్ తో కలిసి ఓపెనర్ గా దిగే అవకాశం ఉంది. అదే జరిగితే మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తుది జట్టులో ఉండకపోవచ్చు. ఒకవేళ మయాంక్ ఓపెనర్ గా దిగితే గిల్ మిడిలార్డర్ లో ఆడే అవకాశం ఉంది. అప్పుడు ఎవరు స్థానానికి ఎర్త్ వస్తుందో చెప్పలేం.

అటు మూడు, నాలుగు స్థానాల్లో పుజార, కోహ్లీ దిగడం ఖాయం. ఐదు, ఆరు స్థానాల్లో విండీస్ పర్యటనలో అదరగొట్టిన రహనే, తెలుగు ఆటగాడు హనుమ విహారిలు ఉన్నారు. అలాగే కీపర్లుగా పంత్,సాహా ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. వీరిలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కుతుంది. అటు వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్‌కు కోసం ఎంపికైనా ఒక్కమ్యాచ్‌లోనూ తుదిజట్టులో చోటు దక్కని పేసర్ ఉమేశ్ యాదవ్‌ను సెలెక్టర్లు పక్కనపెట్టారు. స్వదేశంలో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో తుదిజట్టులో ఎలాగూ నలుగురు పేసర్లు ఉండే అవకాశం లేదు. దీంతో ఉమేశ్‌కు నిరాశ ఎదురైంది. సఫారీలతో టెస్టులకు పేసర్లుగా వెస్టిండీస్‌పై నిప్పులు చెరిగిన బుమ్రా, ఇషాంత్ సహా షమీ ఎంపికయ్యారు. ఇక స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, జడేజా, కుల్‌దీప్ యాదవ్‌లు చోటు దక్కించుకున్నారు.

మ్యాచ్ షెడ్యూల్

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 15న దక్షిణాఫ్రికాతో ధర్మశాల వేదికగా టీమ్‌ఇండియా తలడనుంది. ఆ తర్వాత మొహాలీ(18వ తేదీ), బెంగళూరు(22వ తేదీ)లో తదుపరి మ్యాచ్‌లు జరుగుతాయి. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా వచ్చే నెల 2 నుంచి సఫారీలతో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు విశాఖపట్నం (2-6వ తేదీ) వేదికగా జరుగనుంది. చివరి రెండు టెస్టులు పుణె(10-14), రాంచీ(19-23)ల్లో జరుగుతాయి.

టెస్టు జట్టు

విరాట్ కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రోహిత్‌శర్మ, పుజార, అంజిక్య రహానే(వైస్-కెప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), అశ్విన్, జడేజ, కుల్‌దీప్ యాదవ్, షమీ, బుమ్రా, ఇషాంత్, శుభ్‌మన్ గిల్

 

Leave a Reply