పీఎం కిసాన్ సమ్మాన్ పథకం…కండిషన్స్ అప్లై..

Share Icons:

ఢిల్లీ, 5 ఫిబ్రవరి:

రైతులకు పెట్టుబడి సాయం పేరుతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ.6,000 మూడు వాయిదాల్లో నేరుగా రైతుల ఎకౌంట్‌లలో వేయనున్నారు.

ఇక అందులో భాగంగా మొదటి వాయిదా రూ.2,000 త్వరలో ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ పథకం ద్వారా దేశంలో 12 కోట్ల మంది రైతులు లబ్ది పొందనున్నారు.  

ఈ పథకంలో భాగంగా డిసెంబర్ 2018-మార్చి 2019 కాలానికి మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ రూ. 2వేలు ఈ ఏడాది మార్చిలో రైతుల ఖాతాల్లో జమ కానుంది. అయితే ఈ మొదటి వాయిదా తీసుకునేందుకు రైతులకు ఆధార్ ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఆ తర్వాత వాయిదాలు తీసుకోవాలంటే మాత్రం ఆధార్  తప్పనిసరి. ఇక మొదటి విడతలో ఆధార్ లేని వారు డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డు లేదా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు చూపించి డబ్బులు పొందొచ్చు. కానీ ఆ తర్వాత వాయిదాల కోసం అర్హులైన రైతులను గుర్తించేందుకు ఆధార్ నెంబర్ తప్పనిసరి.

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులను గుర్తించి పేరు, లింగం, వయస్సు, కులం, ఆధార్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్లతో లబ్ధిదారుల జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

మళ్ళీ ఇందులో రెండు హెక్టార్లల లోపు పొలం ఉండి, దంపతులు, 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లల్ని లబ్ధిదారులుగా గుర్తించాలని సూచించింది. ఇక ఈ పథకానికి ఫిబ్రవరి 1, 2019ని కటాఫ్ డేట్‌గా నిర్ణయించింది. ఇక ఈ తేదీ తర్వాత ల్యాండ్ రికార్డ్స్ నమోదు అయి ఉంటే…వచ్చే కొత్త భూ యజమాని వచ్చే ఐదేళ్ల వరకు అర్హులుకారు.

మామాట: మంచి పథకమే…కానీ చాలా కండిషన్స్ ఉన్నాయి…

Leave a Reply