హౌస్ లో సందడి చేసిన సోగ్గాడు: వంటకాలతో అదరగొట్టిన కంటెస్టంట్స్

king nagarjuna enter into big boss house to surprise contestants
Share Icons:

హైదరాబాద్: దసరా సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ నడిచింది. మొదట ఇంటి సభ్యులు రకరకాల వంటకాలతో అదరగొట్టగా, తర్వాత హౌస్ లోకి కింగ్ నాగార్జున సోగ్గాడు గెటప్ లో ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. దసరా పండుగ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ మేళా నిర్వహించారు. ఇంటి సభ్యులని రెండు జట్లుగా విడగొట్టి వారితో కొన్ని వంటకాలపోటీ పెట్టారు. టీం ‘ఏ’లో వరుణ్, బాబా భాస్కర్, అలీ, మహే విట్టాలు ఉండగా.. టీం ‘బి’లో వితికా, శ్రీముఖి, శివజ్యోతి, రాహుల్, వితికాలు ఉన్నారు. సమయానుసారంగా రెండు టీంల సభ్యులకు బిగ్ బాస్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. టీం Aకి క్వాలిటీ చెక్ మేనేజర్‌గా వరుణ్‌ని, టీం Bకి వితికాను ఉంచారు. వీళ్లు ఫుడ్ రుచి చూసి ఏది బాగుందో చెప్తూ పాస్ ఆర్ ఫెయిల్ అన్నది డిసైడ్ చేయాలి. పాసైన వంటకానికి సంబంధించిన సభ్యులకు ఒక పాయింట్ లభిస్తుంది. ఇలా మూడు రౌండ్లలో ఎవరికైతే ఎక్కువ పాయింట్‌లు వస్తాయో వాళ్లే విజేతలు.

ఇక మొదటి రౌండ్ లో భాగంగా రెండు చైనీస్ వంటకాలు చేయాలని రెండు జట్లకు బిగ్ బాస్ ఆర్డర్ ఇచ్చారు. దీంతో దీంతో రెండు టీంలు ఫ్రైడ్ రైస్, చికెన్ 65 చేశారు. అయితే టీం A చేసిన వంటల్లో ఆయిల్ ఎక్కువైందనీ.. టీం B చేసిన వంటల్లో ఉప్పు ఎక్కువైందనీ కంప్లైంట్‌లు రావడంతో బిగ్ బాస్ ఈ రెండు టీంలకు ఒక్కమార్కు కూడా ఇవ్వకుండా ఫెయిల్ చేశారు. రెండో రౌడ్లో భాగంగా ఆంధ్రా వంటకాలు చేయాలని ఆర్డర్ ఇచ్చారు. దీంతో A జట్టు చేపల పులుసు, ఫ్రై చేయగా, B జట్టు రొయ్యల కర్రీ చేశారు. ఈ రెండు కర్రీలు బాగోవడంతో రెండు జట్లకు చెరో పాయింట్ వచ్చింది.

మూడో ఆర్డర్‌లో భాగంగా.. ఒక్కో టీంలో ఒక్కో స్వీట్ ఐటమ్ చేయాలని ఆదేశించారు. ఈ ఐటమ్‌‌ను టేస్ట్ చేయడానికి స్పెషల్ గెస్ట్ వస్తారని బిగ్ బాస్ హింట్ ఇవ్వడంతో స్వీట్ చేయడానికి పోటీ పడ్డారు కంటెస్టెంట్స్. స్వీట్ రెడీ చేసి పెట్టగానే కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా అంటూ హౌస్ లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. లోపలికి తీసుకుని వెళ్లి.. నులక మంచం మీద కూర్చోబెట్టి మరీ తమ వంటకాలను రుచి చూపించారు. రెండు గ్రూప్స్ స్వీట్లను టేస్ట్ చూసిన నాగార్జున.. బాబా భాస్కర్ తయారు చేసిన స్వీట్ కంటే.. రితిక, శ్రీముఖి వాళ్లు తయారు చేసిన స్వీటే చాలా బాగుందని చెప్పారు. ఇక నాగ్ బుధవారం ఎపిసోడ్లో కూడా హౌస్ లో సందడి చేయనున్నారు.

 

Leave a Reply