ఐఫోన్‌ కోసం కిడ్నీ అమ్ముకున్న ఘనుడు

Share Icons:

బీజింగ్‌,  జనవరి 1,

జల్సా ప్రాణాలమీదికి తెచ్చింది. ఐఫోన్‌ కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.జీవితాంతం మంచానికే పరిమితమయ్యాడు.ఏదేదో కథలా అనిపించినా  సత్యం. చేతిలో ఐఫోన్‌ ఉంటే అదో స్టేటస్‌ అని అనుకుంటారు కొందరు. ఈ ఫోన్లకు ఎంత క్రేజ్‌ ఉందంటే.. దానిని కొనివ్వలేదని ఇంట్లో నుంచి వెళ్లిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి ఘటనల గురించి వినే ఉంటాం. కానీ చైనాకు చందిన ఓ యువకుడు ఐఫోన్‌ కోసం ఏకంగా తన కిడ్నీనే అమ్ముకున్నాడు. ఫలితంగా జీవితాంతం మంచానికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకెళితే.. వాంగ్‌ అనే యువకుడు ఐఫోన్‌ కొనుక్కోవాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాడు.

ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో తల్లిదండ్రులు కూడా కొనివ్వలేకపోయారు.ఎలాగైనా ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని ఏకంగా తన కిడ్నీని 3,200 డాలర్లకు అమ్మేశాడు. ఆ డబ్బుతో ఐఫోన్‌ కొనుక్కుని మిగిలిన మొత్తంతో జల్సా చేశాడు. అయితే ఈ ఘటన 2011లో జరిగింది. మళ్లీ ఈ విషయం ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే.. కిడ్నీ తొలగించేటప్పుడు చేసిన చికిత్స విజయవంతం కాలేదు. దాంతో ఇన్‌ఫెక్షన్‌ సోకి ఉన్న ఒక్క కిడ్నీ కూడా పాడైపోయింది.

దాంతో బతికినంత కాలం డయాలసిస్‌ చేయించుకుంటూ ఉండాలి. ఏడాది పాటు తల్లిదండ్రులు కష్టపడి వాంగ్‌కు డయాలసిస్‌ చేయించారు. మున్ముందు చికిత్స చేయించడానికి వారి వద్ద డబ్బు లేదు. చేయించకపోతే వాంగ్ బతకడు. అతను చేసిన పనికి వాంగే కాదు, తల్లిదండ్రులు కూడా కుమిలిపోతున్నారు.

మామాట:  వెర్రి వేయి విధాలని పెద్దలనేవారు… ఇదేనా

Leave a Reply