ఇది అత్యంత చెత్త ఊహాగానం..కియా ప్లాంట్ ఎక్కడికి వెళ్ళడం లేదు…

Share Icons:

అమరావతి: అనంతపురం జిల్లాలో ఉన్న కియా మోటార్స్ తరలిపోతుందని అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ కథనం రాసిన విషయం గురించి తెలిసిందే. ఈ కథనాలపై ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. కియాపై రాయిటర్స్‌ కథనం పూర్తిగా అవాస్తవమని.. అసత్యాలతో కూడిన కథనమని పరిశ్రమలు,వాణిజ్యం,పెట్టుబడుల శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ భార్గవ చెప్పారు. కియా, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని.. ఈ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు.

అటు ఈ కథనంపై కియా మోటర్స్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఏపీలోని  ప్లాంట్‌ను తరలించాలన్న యోచన తమకు లేదని , ఈ కథనం చూసి ఆశ్యర్యపోయామని, ఇది అత్యంత చెత్త ఊహాగానమని రాయిటర్స్ పై మండిపడ్డారు. ఈ మేరకు కియా మోటార్స్‌ ఇండియా హెడ్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) మనోహర్‌ భట్‌ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ఏపీలో తమ ప్లాంట్‌ అద్భుతంగా పనిచేస్తున్న సమయంలో ఇలాంటి ఊహాగానాలు రావడం ఆశ్యర్యం కలిగించిందని  అన్నారు.

ఇటు వైఎస్సార్‌సీపీ విజయసాయిరెడ్డి కూడా దీనిపై స్పందించారు. కియా మోటార్స్ తరలిపోతుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. కియాతో జగన్ గారి నేతృత్వలో కియాతో ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయని.. రాష్ట్రంలో ఆ సంస్థ అభివృద్ధికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.

ఇదిలా ఉంటే.. కియా ఏపీ నుంచి తరలిపోతోందని.. ప్రాథమికంగా చర్చలు ప్రారంభమయ్యాయని రాయిటర్స్ కథనాన్ని ప్రచురించింది. కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడకు తరలిపోయే అవకాశం ఉందని రాయిటర్స్ చెబుతోంది. తమిళనాడు ప్రభుత్వంతో కియా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నాయంటోంది. ఆ సంస్థ కియా ప్లాంట్‌ను రీ లోకేట్ చేసే ఆలోచనలో ఉందని.. వచ్చే వారం సెక్రటరీ లెవల్‌లో సమావేశం జరగనుందని.. ఆ తర్వాత ప్లాంట్ తరలింపుపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాయిటర్స్ అంటోంది. ఏపీలో ఆ సంస్థకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఈ నిర్ణయం తీసుకుందని.. అందుకే ప్లాంట్ తరలించాలని భావిస్తున్నారని తమిళనాడుకు చెందిన కీలక అధికారి కూడా దీన్ని ధృవీకరించినట్లు ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

 

Leave a Reply