Khiladi FirstLook: ‘ఖిలాడి’ రవితేజ యమ స్టైలిష్‌గా ఉన్నాడే.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్

Share Icons:
హిట్టు ఫట్టు అనేది లెక్కచేయకుండా వరుస సినిమాలతో మంచి జోష్‌లో ఉన్న మాస్‌ మహారాజా మరో ఆసక్తికర కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో ”గా తన అభిమానులను అలరించబోతున్నారు. తాజాగా ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించిన చిత్రయూనిట్ ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

ఈ లుక్‌లో బ్లాక్‌ డ్రెస్‌లో స్టైలిష్ స్టెప్‌ వేస్తూ కనిపిస్తున్న రవితేజ యమ అట్రాక్ట్ చేస్తున్నారు. ఆయన చుట్టూ కరెన్సీ నోట్లు గాలిలో ఎగురుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. రవితేజ డ్యూయెల్‌ రోల్‌ పోషిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. మరోవైపు రవితేజ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మే 8నే విడుదల చేయాల్సి ఉండగా.. లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేశారు. థియేటర్స్ ఓపెన్ కాగానే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.