కాంగ్రెస్‌లో ఖమ్మం టికెట్ లొల్లి…

Share Icons:

ఖమ్మం, 14 ఫిబ్రవరి:

మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. అందులోనూ కాంగ్రెస్ బలంగా ఉన్న ఖమ్మం ఎంపీ టిక్కెట్టుపై అందరూ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం పార్లమెంట్ సీటును తనకు కేటాయించాలని రేణుకా చౌదరి డిమాండ్ చేస్తున్నారు. ఈ సీటు తనకు కేటాయించకపోతే  ఏం చేయాలనే దానిపై కూడ రేణుకా చౌదరి కార్యకర్తలతో చర్చించనున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ సీటును తనకు దక్కకుండా చేస్తే పార్టీకి రాజీనామా చేస్తానని ఆమె అనుచరులతో చెప్పినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే ఖమ్మం పార్లమెంట్ సీటు కోసం విహెచ్ లాంటి నేతలు కూడ పోటీ పడడాన్ని రేణుకా చౌదరి అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్  సీటు విషయమై రేణుకా చౌదరి పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఆమె గురువారం నాడు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఖమ్మం జిల్లాకు చెందిన తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మామాట: కాంగ్రెస్‌లో మళ్ళీ టికెట్ల లొల్లి మొదలైందా… 

Leave a Reply