టీడీపీ సమావేశానికి దూరమైన కీలక నేతలు

Share Icons:

విజయవాడ:

 

నారా చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు విజయవాడలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలంతా హాజరుగా కాగా, కొందరు గైర్హాజరయ్యారు. మీటింగ్‌కు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ, అశోక్ గజపతిరాజు, గంటా శ్రీనివాసరావు, కేశినేని నాని, జేసీ సోదరులు హాజరు కాలేదు. అనారోగ్య సమస్యలు, విదేశీ పర్యటనలతో నేతలు మీటింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలిసింది.

 

ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో స్వార్థపరులకు పదవులు ఇస్తున్నారని చంద్రబాబు సమక్షంలోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. కొంతమంది డబ్బు సంపాదించి, పదవులు అనుభవించి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. పార్టీలో యువతకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధినేతను కోరారు. ఇక ప్రతిపక్షంగా టీడీపీ పాత్రపై మరో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

 

మనము ప్రజలకు చాలా చేశామని, కానీ ప్రజలు ఇంకా ఏదో ఆశించి వైసీపీకి ఓటు వేశారని అయ్యన్న అభిప్రాయపడ్డారు. మనం ఇప్పుడే జనంలోకి వెళ్లొద్దని.. ప్రజలకు అవసరమైనప్పుడే వెళ్దామని ఆయన వ్యాఖ్యానించారు. ఆకలేసినప్పుడే అన్నం పెట్టాలని.. అప్పుడే అన్నం విలువ తెలుస్తుందని అయ్యన్నపాత్రుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

Leave a Reply