హుజూర్ నగర్ ఫలితం తర్వాత కాంగ్రెస్ లో కీలక మార్పులు?

key changes in congress party after huzur nagar by election result
Share Icons:

హైదరాబాద్: టీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ గా గెలవడంతో…హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో హుజూర్ నగర్ ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే తాజాగా హుజూర్ నగర్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అకోబ్టర్ 21న ఎన్నిక జరగనుండగా, 24న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేస్తుండగా…టీఆర్ఎస్ తరుపున సైదిరెడ్డి బరిలో ఉన్నారు.

అయితే ఉప ఎన్నిక ఫలితం వచ్చాక కాంగ్రెస్ లో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫలితం కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.  లంగాణలో రేవంత్ రెడ్డికి అన్ని వర్గాలనుంచి మంచి ఫాలోయింగ్ ఉండడంతోపాటు, అదికార గులాబీ పార్టీని సూటిగా ప్రశ్నించగల సామర్థ్యం రేవంత్ రెడ్డికి ఉన్నట్టు చాలా సందర్బాల్లో రుజువయ్యింది. ఇదే అంశాన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకుని రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించేందుకు సిద్దపడినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అభ్యర్ధి అంశలో వివాదాలు చెలరేగినప్పటికి అభ్యర్ది గెలుపు కోసం అందరం సమిష్టిగా కృషి చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తే తన గెలుపు సులభం అయ్యే అవకాశాలు ఉన్నాయని స్వయంగా పద్మావతి పేర్కొనడం విశేషం. అందుకే హుజూర్ నగర్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి ఓ పరీక్షగా నిలిచింది. ఇందులో రేవంత్ సక్సెస్ అయితే పీసీసీ పదవి ఖాయమే. అటు ఉత్తమ్ లాంటి సీనియర్లు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది.

ఇక పదవి వచ్చిన తర్వాత తన మొదటి కార్యాచరణగా యురేనియం తవ్వకాలపై వ్యతిరేకంగా పాదయాత్ర చేయాలనీ రేవంత్ రెడ్డి భావించినట్లు తెలుస్తుంది. అందుకోసం ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్ధం అయ్యినట్లు వినికిడి. గతంలోనే పాదయాత్ర చేయటానికి అన్ని సిద్ధం చేసుకున్న కానీ పీసీసీ చీఫ్ హోదాలో ఆ పాదయాత్ర చేస్తే దానికి వచ్చే క్రేజ్ వేరుగా ఉంటుందని భావించి రేవంత్ రెడ్డి దానిని వాయిదా వేసుకున్నాడు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే మాత్రం తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయే అవకాశం వుంది.

Leave a Reply