ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్…..

Keshav Maharaj second South African to take 9 wickets in a Test innings
Share Icons:

కొలంబో, 21 జూలై:

కొలంబో వేదికగా శ్రీలంక దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ అరుదైన రికార్డు నమోదైంది. దక్షిణాఫ్రికా ఎడంచేతి వాటం స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ ఒకే ఇన్నింగ్స్ లో 9 వికెట్లు నెలకూల్చి 61 ఏళ్ల క్రితం నమోదైన రికార్డుని సమం చేశాడు.

అయితే 1957లో తొలిసారి దక్షిణాఫ్రికా ఆఫ్‌ స్పిన్నర్‌ హగ్‌ టైఫీల్డ్‌ ఈ ఘనతను అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హగ్‌ టైఫీల్డ్‌ ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఆ రికార్డుని అదే దేశానికి చెందిన ఆటగాడే సమం చేయటం విశేషం.

గతంలో జేసీ లేకర్‌ (ఇంగ్లండ్‌), అనిల్‌ కుంబ్లే (భారత్‌)లు ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే శ్రీలంక దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తన మొదటి ఇన్నింగ్స్ లో 338 పరుగులకి ఆలౌట్ కాగా, సౌత్ ఆఫ్రికా కేవలం 124 పరుగులకే చేతులెత్తేసింది. ఇక అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక జట్టు వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది.

మామాట: అరుదైన రికార్డే…!

Leave a Reply