రూ. వెయ్యి కోట్లు దాటిన విరాళాలు

Share Icons:

కేరళ, ఆగస్టు 31,

జల ప్రళయంతో కకావికలమైన కేరళను ఆదుకునేందుకు యావత్ భారతావని ముందుకొచ్చింది. చిన్నారుల నుంచి బడా వ్యాపారులు, రాజకీయ నాయకుల వరకూ తమకు చేతనైనంత సాయం చేయడంతో కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి చేరిన విరాళాల విలువ రూ. 1000 కోట్లను దాటింది. గురువారం వరకూ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 1,027 కోట్లు వచ్చి చేరాయని, 4.76 లక్షల మంది ఆన్ లైన్ ద్వారా విరాళాలు ఇచ్చారని, వారందరికీ కేరళ సర్కారు కృతజ్ఞతలు చెప్పింది.

కేరళ వరద సాయంగా ఇప్పటివరకు, ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా రూ. 145.17 కోట్లు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ మాధ్యమంగా మరో 46.04 కోట్లు వచ్చాయని, డైరెక్ట్ డిపాజిట్లు, చెక్కుల రూపంలో 835.86 కోట్లు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. కాగా, గత శతాబ్దకాలంలో ఎన్నడూ రానంత వరద ఒక్కసారిగా విరుచుకుపడగా, తిరువనంతపురం మినహా మిగతా అన్ని జిల్లాలూ నీట మునిగాయి. అధికారిక లెక్కల ప్రకారం, 483 మంది మరణించగా, వేల కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కేంద్రం ఇప్పిటివరకూ రూ. 500 కోట్లు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.

 

మామాట: మనసున్న మారాజులకు వందనాలు

Leave a Reply