వైఎస్ భారతిగా కీర్తి సురేష్..!

Share Icons:

హైదరాబాద్, 23 మార్చి:

మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను చిత్ర దర్శకుడు చుహి రాఘవ అధికారికంగా ప్రకటించాడు.

వైఎస్ఆర్ పాత్రలో మమ్ముటి నటించనున్న ఈ చిత్రానికి ‘యాత్ర’ అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నారు.

అయితే ఇందులో వైఎస్ఆర్ తనయుడు, యువ నాయకుడు వైఎస్ జగన్‌గా తమిళ హీరో సూర్య నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే తాజా సమాచారం ప్రకారం జగన్ సతీమని వైఎస్ భారతిగా కీర్తి సురేష్ నటించనున్నట్లు తెలుస్తోంది.

ఒకవైపు గృహిణిగా, మరోవైపు వ్యాపారవేత్తగా భారతి మంచి పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మే నుంచి ప్రారంభం కానుంది.

మామాట: మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో..?

English Summary: As Malayalam Superstar Mammootty has already given his nod to reprise the role of former CM YS Rajasekhara Reddy in his biopic, the pre-production work has taken pace. Makers are planning to rope in only stars for other key characters in the biopic too. The latest we hear is that reigning South heroine, Keerthy Suresh has been approached to play the role of YSR’s daughter-in-law and Jagan’s wife, YS Bharati.

Leave a Reply