తెలంగాణ శాసన సభ రద్దు

Share Icons:

హైదరాబాదు, సెప్టెంబర్ 06,

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాలని గవర్నర్ నరసింహన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. అసెంబ్లీని రద్దు చేయాలంటూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని గవర్నర్ కు అందజేశారు. కేబినెట్ నిర్ణయం మేరకు అసెంబ్లీని రద్దుచేయాలని విన్నవించారు. దీంతో, అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.

తదనంతరం అసెంబ్లీ రద్దు నోటిఫికేషన్ రాజ్ భవన్ నుంచి ఎన్నికల సంఘానికి, అసెంబ్లీ కార్యదర్శికి వెళతాయి. అసెంబ్లీ సెక్రటరీ నుంచి ప్రకటన వెలువడగానే అసెంబ్లీ రద్దవుతుంది. అనంతరం ముందస్తు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం తన కార్యాచరణను మొదలుపెడుతుంది. అసెంబ్లీ రద్దయిన వెంటనే ఎమ్మెల్యేలంతా మాజీలు అయిపోతారు. ప్రస్తుతం గవర్నర్ తో కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది.

 ఆమోదం….

4 సంవత్సరాలు 3 నెలల 4 రోజుల పాటు కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ రద్దైంది. అసెంబ్లీని రద్దు చేయాలంటూ కేబినెట్ తీసుకున్న తీర్మానాన్ని గవరనర్ నరసింహన్ ఆమోదించారు. దీంతో అసెంబ్లీ రద్దయినట్టు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి రాజ్ భవన్ నుంచి నోటీసులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో, ముందస్తు ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు.

మామాట:  ఇక ముందుంది ముసళ్ల పండుగ 

Leave a Reply