కేసీఆర్ సంచలన నిర్ణయం: కొత్త ఆర్టీసీ ఉద్యోగుల నియమకాలు షురూ..

telangana cm kcr introduce budget 2019-20 in assembly
Share Icons:

హైదరాబాద్: గత ఐదు రోజులుగా తమ డిమాండ్లని నెరవేర్చాలని  ఆర్టీసీ కార్ముకులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేసి సంచలనానికి తెరదీశారు. దీంతో వారికి ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యం కూడా నిలిచిపోయింది. మరోవైపు కేసీఆర్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నారు.

ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకానికి కసరత్తు చేయాలని… అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు డ్రైవర్‌లు, కండక్టర్ల నియామకంపై.. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ ఫైల్‌ను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత కొత్త డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది.

మరోవైపు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రరావు, సీపీఐఎంఎల్ నుంచి పొట్టు రంగారావు, తెలంగాణ జనసేన అధ్యక్షుడు శేఖర్ గౌడ్, ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, థామస్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, టీఎస్సార్టీసీ కార్మికులు కేసీఆర్ కు పాలేర్లు కాదని విమర్శించారు. ఆర్టీసీ సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రామచంద్రరావు స్పందిస్తూ, సీఎం కేసీఆర్ మాటలు ఆయన అహంకారానికి నిదర్శనం అని ధ్వజమెత్తారు. గతంలో ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి వారిపై వ కేసీఆర్ వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నట్టు నటించారని, కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ప్రజా సంక్షేమం కోసం ఉంది లాభనష్టాల కోసం కాదు అని, కార్మికులను తొలగించే హక్కు కేసీఆర్ కు లేదని అన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణానికి నాడు తమ ఉద్యమం నాంది పలికిందని జేఏసీ నేత రాజిరెడ్డి గుర్తుచేసుకున్నారు. ఇక ‘ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం మొదలైందని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు సీఎంకు పట్టవని.. తన ఆస్తుల రెగ్యులరైజేషన్‌పైనే కేసీఆర్ దృష్టి ఉందని విమర్శించారు. ఆర్టీసీని కేసీఆర్ తక్కువ అంచనా వేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రజల మద్దతు ఉందని ఎంపీ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారా? అని ఆయన ప్రశ్నించారు.

 

Leave a Reply