కార్తీక శుద్ధ సప్తమిన కేసీఆర్ నామినేషన్

Share Icons:

మెదక్, నవంబర్ 10,

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. 14న ఆయన గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఆ పార్టీ నేత హరీశ్ రావు తెలిపారు. 14న కార్తీక శుద్ధ సప్తమి కావడంతోనే ఆ రోజును ఎంచుకున్నట్టు తెలుస్తోంది. బుధవారం ఉదయం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేసీఆర్ అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి 11:23 గంటలకు గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీ మధ్య సంగాపూర్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చేరుకుని ప్రసంగిస్తారు. తూఫ్రాన్లో  నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు.ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించనున్న సమావేశంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు కేసీఆర్ బీఫారాలు అందించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే ప్రకటించిన 107 మంది అభ్యర్థలకు ఆహ్వానాలు అందాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ వీరికి బీ-ఫారాలు అందించనున్నారు.

మామాట: గ్రహగతులు అనుకూలించాలి కదా పదవీ యోగానికి

Leave a Reply