కేసీఆర్ పంథా ఏమిటో?

kcr-national politics-Delhi tour
Share Icons:

తిరుపతి, డిసెంబర్ 12,

తెలంగాణలో ఎన్నికలు ముగుసాయి. ఫలితాలు కూడా వెలువడ్డాయి. నేడో, రేపో రెండో మారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అయితే, అంతకుముందు… మంగళవారం సాయంత్రం ఫలితాలు వెలువడుతున్న సాయంత్రంలో కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశం ఒక చారిత్రిక ఘట్టానికి తెరతీయనుంది. విజయభావుటా ఎగురవేసిన సంద్రశేఖర రావులో ఎక్కడా అహంకారం కనిపించలేదు. గర్వం తొనికిసలాడలేదు. చాలా పరిణిత మనష్కుడుగా 11 వ తేదీ పాత్రికేయ సమావేశంలో మాడ్లాడిన కేసీఆర్ మాటల వెనుక చాలా పదునైన వ్యూహాలున్నాయి.

కేసీఆర్ మాట్లాడినదాంట్లో విలువైన సమాచారం ఉంది. అయితే దానిని అంది పుచ్చుకోవడానికి మీడియా సిద్దంగాలేకపోవడం విచారకరం. చాలా పనికిరాని విషయాలను స్ర్కోలింగ్ చేసే పనిలోనే మీడియా ఉండిపోతోందని.. నిన్నటి సమావేశం రుజువుచేసింది. దేశం నాకేమిచ్చిందనేది కాకుండా దేశానికి నేనేమిచ్చాను అనే ఆలోచనతో కేసీఆర్ గత కొంతకాలంగా తెరవెనుక పనిచేస్తున్నట్టు కనిపించింది.

స్వతంత్ర్యం తరువాత కేంద్రంలో పాలన చేసిన వారు భారత భావితరాలపై శ్రద్ధతో కాకుండా.. కేవలం దేనందిన రాజకీయాలను నడపడానికే పరిపాలన సాగించినవిషయం తెలిసిందే.  దేశంలో ఉన్న అనేక సహజవనరులను, ప్రకృతి సంపదలను నిర్వీర్యం చేశారు. మౌలిక వసతులు కల్పించడంలో, పారదర్శకంగా అందరికీ సమానావకాశాలు కల్పించడంలో కేంద్రంలో పరిపాలన చేపట్టిన పార్టీలు విఫలమైనాయి.

దేశానికి దశ.దిశ నిర్దేశం చేసే నాయకత్వం లేదు.  పార్టీలన్నీ అధికారం కోసం సిద్దాంతాలను పక్కన పెట్టి వ్యవహారాలు నడిపినవే… వామపక్షాలతో సహా. నిజానికి వామపక్షాల సంకుచిత మనస్తత్వమే ఈ దేశం ఇంతగా పతనం కావడానికి కారణంగా చెప్పవచ్చు. వారు తొలి నుంచీ బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా కేంద్రంలో వ్యవహరించి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది.

దేశవ్యాప్తంగా ప్రతి నర నరంలో ఇంకిపోయిన అవినీతిని వెంటనే, ఓ ఎన్నికతో తుడుచి పెట్టడం వీలుకాదు కానీ, దేశంలోని అన్ని వనరులను సమర్థవంతంగా నిర్వహించుకునే కేంద్ర ప్రభుత్వం రావాలి.

కేంద్రానికి-రాష్ట్రాలకు మధ్య చాలా రాజ్యాంగపరమైన విషయాలు పరిష్కారం కావలసి ఉంది. అవసరమైతే ఈ విషయంలో రాజ్యాంగ సవరణ కూడా చేయాలి. అందుకు బలమైన ప్రాంతీయ నాయకత్వం కావాలి. రాష్ట్రాలతో కాంగ్రెస్, భాజాపా పాలకులు చాలా తృణీకార భావంతో వ్యవహరిస్తున్న తీరు సమసిపోవాలి. దేహీ అనే పరిస్థితి నుంచి రాష్ట్రాలు బయటపడాలి.

భారత జాతిని ముందుకు నడిపించడానికి నరేంద్రమోదీకి చాలా చక్కని అవకాశం కాలం కలిగించింది, కానీ ఆయనలోని అహంకారి ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. కొత్త తరం ఆశలకు, ఆధునిక యువతకోసం పనిచేయవలసిన చక్కని సమయాన్ని భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కేంద్ర పాలకులు వృధాచేశారు. ఈనేపథ్యంలో కేసీఆర్ 11 వ తేదీన చేసిన ప్రసంగాన్ని విషయ ప్రధానంగా విశ్లేషించ వలసి ఉంది. ఫక్తు రాజకీయాల అధ్దాల నుంచీ చూచే వారికి అది చప్పగానే కనిపిస్తుంది. దేశం పట్ల ఆవేదన ఉన్నావారికి ఆశలు కలింగిచే ప్రసంగం అది. కేసీఆర్ 11.12.18 ప్రగతి భవన్ లో చేసిన ప్రసంగం సాకారం కావాలని ఆశిద్దాం.

మామాట: ప్రపంచ యాత్రకూడా తొలి అడుగులతోనే మొదలవుతుంది… అదే ఆశ.

Leave a Reply