కేసీఆర్ పై మండిపడ్డ కేఏ పాల్

Share Icons:

హైదరాబాద్, ఏప్రిల్ 30,

ప్రజాశాంతి పార్టీ అద్యక్ష్యుడు కేఏ పాల్, ఇటీవల తెలంగాణాలో జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందిస్తూ తీవ్ర ఆవేదనని వ్యక్తం చేశారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, ఒక్కొక్క బాధిత కుటుంబానికి కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నేడు అమీర్‌పేటలోని తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇంటర్ మార్కుల అవకతవకలపై విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, లేకపోతె తీవ్ర పరిణామాలను ఎదురుకోక తప్పదని పాల్ హెచ్చరించారు.

కాగా బోర్డు అవకతవకలపై ఆందళన చేపట్టే ఇతర పార్టీలకు తమ పార్టీ కూడా మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు తమ ఆందోళనలు జరుగుతూనే ఉంటాయని, తానూ కూడా ఆందోళనకు దిగుతానని పాల్ అన్నారు.

అంతేకాకుండా విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలస్యంగా స్పందించడాన్ని తప్పుబడుతూ, వెంటనే విద్యాశాఖా మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు పాల్.

మామాట: శ్రీలంకకు డబ్బిచ్చారటకదా, ఇక్కడ ఇవ్వవచ్చుకదా పాల్ సర్

Leave a Reply