జాతీయ రాజకీయాల్లో కెసిఆర్‌ కీలకం కానున్నారు: తుమ్మల

Share Icons:

ఖమ్మం, ఏప్రిల్ 09,

ఖమ్మం లోక్ సభ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం ఇటింటా ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి త్ముమల నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా సాగుతుందనీ,బిజెపి ,కాంగ్రెస్‌ పార్టీలకు సోంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే సంఖ్యాబలం రాదన్నారు.

దేశ వ్యాప్తంగా 70వేల టిఎంసిల పాగునీరు,3లక్షల మెగావాట్ల విద్యుత్‌ వృదా అవుతోందన్నారు.వీటిని వినియోగంలోకి తేచ్చే ప్రణళికలు అ పార్టీలకు లేవని విమర్శించారు. దేశ రాజకీయాల్లో కెసిఆర్‌ కీలకం కానున్నారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలు కానున్నాయని తుమ్మల తెలిపారు.

మామాట: అలాగే అనుకోండి నష్టం ఏమీ లేదుగా..

Leave a Reply