మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించిన కౌశల్…

kaushal said about one more interesting matter
Share Icons:

హైదరాబాద్, 10 అక్టోబర్:

బిగ్‌బాస్ సీజన్2 విజేతగా నిలిచి… రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువమంది అభిమానులను సొంతం చేసుకున్నాడుకౌశల్. ఇక ఇప్పటికే అతడికి డాక్టరేట్ అవార్డుతో పాటు, అతడి పేరుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటివరకు ఏ టీవీ రియాలిటీ షోలోని ఎవరికీ రానన్ని ఓట్లు తనకి రావాడంతో గిన్నీస్ బుక్ నిర్వాహకుల నుండి తనకి కాల్ వచ్చిందని కౌశల్ అన్నారు. అలాగే డాక్టరేట్ ఎందుకు ఇస్తున్నారనే విషయాలపై కౌశల్ త్వరలోనే స్పందిస్తానన్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కౌశల్ మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. అతడికి ప్రధానమంత్రి ఆఫీస్ నుండి కాల్ వచ్చిందని చెప్పి షాక్ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ విజేతగా నిలిచిన తరువాత అతడికి కంగ్రాట్స్ చెబుతూ పీఎమ్ ఆఫీస్ నుండి ఓ వ్యక్తి ఫోన్ చేశారట. కౌశల్ షూటింగ్ లో ఉండడంతో అతడు తండ్రి ఫోన్ తీసి మాట్లాడినట్లు వెల్లడించాడు.

మామాట: మొత్తానికి కౌశల్ క్రేజ్ అన్ని చోట్లకి పాకిందనే చెప్పాలి…

Leave a Reply