కౌశల్ హీరోగా ‘సేనాని’..?

Share Icons:

హైదరాబాద్, 12 జనవరి:

‘బిగ్ బాస్ 2’ షోతో ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్న కౌశల్ హీరోగా ఓ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే హీరో కావాలనేది తన లక్ష్యమని కొన్ని ఇంటర్వ్యూస్ చెప్పిన కౌశల్… ఓ యువ దర్శకుడు వినిపించిన కథ నచ్చడంతో, హీరోగా చేయడానికి అంగీకరించినట్టుగా సమాచారం.

ఇక ఈ సినిమాను నిర్మించడానికి ఒక నిర్మాత సిద్ధంగా ఉన్నాడనీ, ఆయనకి మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకి ‘సేనాని’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా… త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు.

అలాగే సమకాలీన రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాత్ర ఆధారంగా ఈ సినిమా కొనసాగుతుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మామాట: కౌశల్‌కి మంచి అవకాశమే వచ్చింది…

Leave a Reply