TRENDING NOW

కౌశల్ ఆర్మీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి….

కౌశల్ ఆర్మీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి….

హైదరాబాద్, 14 సెప్టెంబర్:

తెలుగు బిగ్‌బాస్ సీజన్2 సంచలనాలకు నెలవుగా మారింది. ఈ సీజన్ మొదలైన దగ్గర నుండి దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ప్రతిరోజూ హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక ఈ సీజన్లో కంటెస్టెంట్‌గా ఉన్న కౌశల్‌కి ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు తన కోసం ఏకంగా కౌశల్ ఆర్మీలు అంటూ సోషల్ మీడియాలో అనేక గ్రూపులు, పేజీలు ఏర్పాటు అయ్యాయి. ఇక ఈ ఆర్మీలు కౌశల్‌ని ఎలిమినేషన్ నుండి కాపాడడం, అతడికి అత్యధిక ఓట్లు నమోదయ్యేలా చూడడం వంటివి చేస్తుంది.

ఈ నేపథ్యంలోనే కౌశల్‌కి యాంటీగా ఉన్నవారు అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్నటి వరకు కౌశల్ ఆర్మీపై బాబు గోగినేని తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  తాజాగా సినీ విమర్శకుడు కత్తి మహేష్ కూడా ఈ ఆర్మీ పై స్పందించారు.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy
treefurn AD

అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదని, బిగ్‌బాస్‌కి వచ్చిన తరువాత అందరూ కుటుంబ సభ్యుల్లా మెలగాలని అన్నారు. హౌస్ మేట్స్‌లో కొందరు కొందరికి నచ్చోచ్చు, నచ్చకపోవచ్చని, అలా అని ట్రోల్ చేస్తారా..? అని ప్రశ్నించారు. ఇక తమకి నచ్చని వారిపై కౌశల్ ఆర్మీ హేయమైన పదజాలంతో విమర్శించడం కరెక్ట్ కాదని సూచించారు.

కౌశల్‌‌కి ఉన్నట్లే మిగిలిన కంటెస్టెంట్స్‌కి కూడా కుటుంబాలు ఉంటాయని, వారికి ఈ ట్రోలింగ్‌లు బాధ కలిగిస్తాయని పేర్కొన్నారు. అసలు కౌశల్ ఆర్మీ అనే పదంలోనే హింస కనిపిస్తోందని, అసలు ఈ కౌశల్ ఆర్మీ ఎవరికి సైన్యం..? ఎవరి కోసం సైన్యం..? అనేది అర్ధం కావడం లేదని అన్నారు.

ఎవరీ కౌశల్.. బహుశా ఆయన కొందరికి నచ్చి ఉండొచ్చు.. నాకు నచ్చలేదు అలాగని ట్రోల్ చేస్తారా..? అంటూ ఇటీవల ఆయన పేరు మీద 2కె రన్ చేశారు.కేరళ వరద బాధితుల కోసం అలా చేసి ఉంటే సమాజానికి మంచి సంకేతాలు అంది ఉండేవి”  అని తెలిపారు.

మామాట: మరి కత్తి వ్యాఖ్యలపై కౌశల్ ఆర్మీ ఎలా స్పందిస్తుందో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: