మరోసారి చిరంజీవి టైటిల్ తో కార్తీ….ఇది కూడా హిట్టేనా

Karthi teams up with Jyothika for Jeethu Joseph’s Donga
Share Icons:

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ మలుపు తిప్పిన చిత్రం ఖైదీ. అదే టైటిల్ తో తమిళ్ హీరో కార్తీ నటించిన సినిమా వచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవికి కెరీర్ కు ఖైదీ ఎలా ఉపయోగపడిందో…ఇప్పుడు కార్తీ కెరీర్ కు ఇప్పుడు వచ్చిన ఖైదీ సినిమా కూడా ఉపయోగపడింది. అక్టోబర్ 25న విడుదలైన ఈ ఖైదీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కార్తీ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించింది. ఇక ఈ చిత్రం తర్వాత కార్తీ మరో సినిమాతో డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

అది కూడా చిరంజీవి అప్పట్లో హిట్ కొట్టిన దొంగ అనే టైటిల్ ని ఈ సినిమాకు పెట్టారు. ఈ సినిమాలో జ్యోతిక.. కార్తి అక్క పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అదే రోజున బాలకృష్ణ ‘రూలర్’, సాయి ధరమ్ తేజ్. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలు విడుదల కానున్నాయి.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లుకు సీక్వెల్…

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. తాజాగా ఈయన తన శిష్యుడు..సిద్దార్ధ తాతోలు దర్శకత్వంలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ఈ సినిమాలో పప్పులాంటి అబ్బాయి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ టైటర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.

తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్‌కు రెడీగా ఉన్న ఈ సినిమాకు వర్మ..సీక్వెల్ ప్రకటించాడు. ఈ సినిమాకు ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అనే టైటిల్ ఖరారు చేసాడు. అంతేకాదు ఈ సినిమాలో వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్ళే నేపథ్యంలో, ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలను చర్చించబోతున్నట్టు ప్రకటించాడు.

 

Leave a Reply