ఆకట్టుకుంటున్న కార్తీ ‘ఖైదీ’ టీజర్…

Share Icons:

హైదరాబాద్, 31 మే:

వైవిధ్యభరితమైన సినిమాలు చేయడంలో ముందుండే హీరో కార్తీ…మరో కొత్త కథతో ముందుకొచ్చారు. కార్తీ ప్రధానపాత్రగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఒక ఆసక్తికరమైన కథాంశంతో ఖైదీ సినిమాని రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది.

ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టీజర్…సినిమాపై అంచనాలని పెంచేసింది. ఇక ఈ సినిమాలో ‘ఖైదీ’గా డిఫరెంట్ లుక్ తో కార్తీ కనిపించనున్నాడు. ఒక రాత్రివేళ జైలు నుంచి తప్పించుకున్న ‘ఖైదీ’ కోసం ఒక వైపున పోలీసులు .. మరో వైపున రౌడీ గ్యాంగ్ గాలిస్తూ ఉండటమే ఈ సినిమా కథ.

అయితే ఈ సీన్లే ఉత్కంఠభరితమైన మలుపులతో కొనసాగుతూ ఉంటుంది. అందువలన సినిమా అంతా చీకటిలోనే నడుస్తుంది. అందువల్లే ఈ సినిమాలో కథానాయికకి కూడా స్థానం లేకుండా పోయింది.

మామాట: మరి చూడాలి ఈ ఖైదీ ప్రేక్షకులని ఏ మేర ఆకట్టుకుంటుందో..

Leave a Reply