రివ్యూ: ఆకట్టుకునే ‘దొంగ’

Karthi teams up with Jyothika for Jeethu Joseph’s Donga
Share Icons:

హైదరాబాద్: ఇటీవల ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన హీరో కార్తీ తాజాగా నటించిన చిత్రం దొంగ. దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం…

సినిమా కథ విషయానికొస్తే…విక్కీ(కార్తీ) గోవాలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అయితే 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన కొడుకు శర్వా కోసం తండ్రి జ్ఞాన మూర్తి(సత్య రాజ్) అక్క పార్వతి(జ్యోతిక)లు వెతుకుతుంటారు. ఇక ఇలాంటి కుటుంబంలోకి గోవా పోలీస్ అధికారి జీవానంద్(ఇళవరసు) డబ్బుకోసం విక్కీతో కుమ్మకై శర్వగా అతనిని  వాళ్ళ ఇంట్లో ప్రవేశ పెడతాడు.  ఇక ఇక్కడ నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది. చివరికి ఎలా ముగిసిందనేది సినిమాలో చూడాల్సిందే.

ఇక నటీనటుల విషయానికొస్తే ఖైదీ లాంటి చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న కార్తీ..దొంగలో కూడా అదరగొట్టేశాడు. ఎప్పటిలాగానే తన కామెడీ టైమింగ్‌తో ఫుల్ నవ్వు తెప్పించాడు. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతున్న స్టోరీకు కార్తీ కరెక్ట్ గా సరిపోయాడు. అటు యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ అదరగొట్టాడు. ఇక సత్యరాజ్, జ్యోతికలు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఎమోషనల్ సీన్స్ లో జ్యోతిక సెట్ అయింది. ఇక ఫస్టాఫ్ కామెడీతో నడిస్తే, సెకండాఫ్ సస్పెన్స్ కొనసాగుతుంది.

ఫస్ట్ హాఫ్ స్లోగా మొదలవడం అలాగే ఈ సినిమా ఆల్రెడీ ఎక్కడో వచ్చిందనే భావన కలగడం  కొంత వరకు మైనస్ అనిచెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో ఫన్ ఎలిమెంట్స్ లేకపోవడం, ఉన్న హీరోయిన్ ని కేవలం మొదటి సగానికే పరిమితం చేయడం మరొక బలహీనత. ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. వింద వసంత పాటలు బాగున్న బ్యాక్‌గ్రౌండ్ పర్వాలేదు అన్నట్లుగా ఉంది. దర్శకుడు జీతూ జోసెఫ్ ఒక క్రైమ్ థ్రిల్లర్ ని తెరకెక్కించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు.

మొత్తానికి చూసుకుంటే ‘దొంగ’ బాగా ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్.

Leave a Reply