తమిళనాడుకు నీళ్లు ఇవ్వలేం: కర్ణాటక

Share Icons:

బెంగళూరు, 4 మే:

నిన్న కావేరీ జలాల వివాదంలో కర్ణాటక, కేంద్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

వెంటనే తమిళనాడుకు ప్రస్తుతం ఇస్తున్న దానికంటే 4 టీఎంసీలు అదనంగా నీటిని విడుదల చేయాలని కర్ణాటక రాష్ట్రాన్ని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై కర్ణాటక నీటి వనరుల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ స్పందించారు.

తమిళనాడుకు అదనంగా నీరు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రం లేదని, ఒకవేళ తమిళనాడుకు నీరు ఇవ్వాలని తమకున్న, తమ వద్ద అంత నీటి నిల్వ లేదని చెప్పారు.

ప్రస్తుతం కావేరీ బేసిన్‌లోకి నాలుగు కాల్వల నుంచి మొత్తం 9 టీఎంసీల నీరు వస్తోందని, ఆ నీరు కాస్తా తమకు తాగడానికి, పొలాలకు సరిపోవడంలేదని ఆయన తెలిపారు.

తమకు నీటి కొరత ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించలేకపోతున్నాం క్షమించండి అని కోరారు. ఈ విషయం గురించి సుప్రీంకు వివరణ ఇస్తామని ఆయన వెల్లడించారు.

మామాట: అంతేలే ఇప్పుడు నీళ్ళు ఇస్తే ఓట్లు పడటం కష్టం కదా…!

English summary:

The Supreme Court on Thursday directed the Karnataka government to respond on how much of the 4 tmcft of water to Tamil Nadu. Reacting to the Supreme direction, Karnataka Water Resources Minister M B Patil said, “We are not in a position to comply with the direction as only 9 tmcft water is left in the reservoirs in the Cauvery river basin.

Leave a Reply