సాధ్వీనే అసలు ఉగ్రవాది..

Share Icons:

బెంగళూరు, 18 మే:

సాధ్వి ప్రజ్ఞా సింగ్ పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించిన సాధ్వి ముమ్మాటికీ ఉగ్రవాదేనని అన్నారు.

గాంధీని చంపినవారిని దేశ ప్రజలంతా ఉగ్రవాదిగానే భావిస్తారని, వారిని దేశభక్తులుగా చూసే వారు కూడా ఉగ్రవాదులేనని చెప్పారు. మరి ఈ వివాదాలు ఎప్పటికీ ఆగుతాయో చూడాలి.

కాగా, స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది హిందువే అని, గాంధీని చంపిన గాడ్సే ఉగ్రవాది అని మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తూ…సరికొత్త వివాదాలని సృష్టిస్తున్నారు. ఇక బీజేపీ నాయకురాలు సాధ్వీ ప్రజ్ఞా సింగ్ గాడ్సేనే అసలు దేశభక్తుడంటూ మరో వివాదానికి తెరతీశారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ అధిష్ఠానం కూడా సీరియస్ కావడంతో, ఆమె క్షమాపణలు చెప్పారు.

మామాట: ఈ వివాదం ఇప్పటితో ఆగదేమో

Leave a Reply