కుట్రలతోనే అధికారం సాధించారు…ప్రభుత్వం ఎలా నడుపుతారో చూస్తా: కుమారస్వామి

another shock for congress-jds govt in karnataka
Share Icons:

బెంగళూరు:

 

కర్ణాటక రాజకీయాలు మొత్తానికి ఓ కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా యడియూరప్పప్రమాణస్వీకారం చేశారు. మరోసారి అసెంబ్లీ బలపరీక్షలో గెలిచారు. అటు స్పీకర్ రమేశ్ కుమార్ కాంగ్రెస్-జేడీఎస్ 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అలాగే ఆ వెంటనే ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేశారు.

 

ఇక నిన్న కన్నడ విధాన సభలో యడియూరప్ప విశ్వాస పరీక్ష సందర్భంగా మాజీ సీఎం కుమారస్వామి బీజేపీ తీరుని ఎండగట్టారు. తృప్తులు, అసంతృప్తులుగా ఎప్పుడు ఎందుకు మారిపోయారో వారిలోకి ఏం దూరిందో అర్థం కాలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రధానమంత్రి గానీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గానీ బీజేపీ కార్యాధక్షులు జె.పి.నడ్డాలు చేసింది ఏమీ లేదని కేంద్రం నుంచి సహకారం ఏమీ లేదని కేవలం కుట్రలతోనే అధికారం సాధించుకున్నారన్నారు. ఇప్పటికైనా రాజీనామాలు కుతంత్రాలను నిలపాలన్నారు.

 

మేం మీ సంఖ్యను 100కు దిగజార్చమని అంతకుమించి మీ ప్రభుత్వాన్ని కూల్చేది లేదన్నారు. జరపండి ఎలా ప్రభుత్వాన్ని నడుపుతారో చూస్తానంటూ సవాల్‌ విసిరారు. ఇదిలా ఉంటే దాదాపు 23 రోజులుగా ముంబై, పూనెలలో గడిపిన రెబల్ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు తిరిగి వచ్చారు. వారిలో కొందరు మీడియాతో మాట్లాడుతూ…తమపై అనర్హత వేటు సమంజసం కాదన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యానే రాజీనామాలు చేశామని, ఆపరేషన్‌ కమలకు తలొగ్గలేదన్నారు.

 

ఇక కొనుగోలు చేసేందుకు మేమేమైనా గుర్రాలమా..? రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ఎవరూ పేదరికంలో కొట్టుమిట్టాడే పరిస్థితిలో లేమని ఎంటిబి నాగరాజ్‌ తెలిపారు. సోమవారం హొసకోటెలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు కలుషితమయ్యాయని ఇక గుడ్‌ బై చెప్పే ఆలోచనలో ఉన్నామన్నారు. డి.కె.శివకుమార్‌ సవాల్‌ను స్వీకరిస్తానని ఎన్నికల్లోనే సమాధానం చెబుతానన్నారు.

Leave a Reply