డబ్బులు చెట్లకి కాయడం లేదంటున్న కర్ణాటక సీఎం…

డబ్బులు చెట్లకి కాయడం లేదంటున్న కర్ణాటక సీఎం…
Views:
18

బెంగళూరు, 10 ఆగష్టు:

కర్ణాటక రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధుల్ని త్వరగా విడుదల చేయడం లేదని కొందరు విమర్శించడంపై సీఎం కుమారస్వామి మండిపడ్డారు.

ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతు రుణమాఫీ, షాదీ భాగ్య, ఇతర పథకాలకు తాను నిధులు కేటాయించడం లేదని కొందరు విమర్శిస్తున్నారని చెప్పారు. అయితే వాళ్లందరూ తెలుసుకోవాల్సింది ఒక్కటేనని, అనుకున్న వెంటనే ఇచ్చేయడానికి తన దగ్గర చెట్లకు డబ్బులు కాయడం లేదని వ్యాఖ్యానించారు.

ఇక పథకాల అమలు, నిధుల విడుదలలో తాను అధికారుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నిధులు విడుదల చేయాల్సిందిగా తాను అధికారుల్ని ఆదేశిస్తూ ఉంటానని వెల్లడించారు.

అయితే ఇప్పటికే ప్రభుత్వంపై రూ.49,000 కోట్ల రైతుల రుణాలను మాఫీ చేయాల్సిన బాధ్యత ఉందనీ, కాబట్టి ప్రజలు కొంచెం సహనంతో వ్యవహరించాలని ఆయన కోరారు. అలాగే మిగతా సంక్షేమ పథకాలకు ఎలాంటి లోటు రానివ్వబోనని ఆయన స్పష్టం చేశారు.

మామాట: సంకీర్ణ ప్రభుత్వం ఉంటే ఇలాగే ఉంటుంది….

(Visited 17 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: